కాంగ్రెస్ నేత గూండాగిరి


Wed,November 14, 2018 12:17 AM

-రోడ్డుపై ఉంటే.. హారన్ కొట్టాడని అనుచరులతో దాడి
-ఇంట్లోని వస్తువులు, కారు అద్దాలు ధ్వంసం
-మహిళ దుస్తులు చింపి.. అసభ్యపదజాలంతో దూషణ
- కాళ్లు మొక్కించుకొని వెళ్లిపోయిన నాయకుడు
-దమ్మాయిగూడ లక్ష్మీనగర్‌లో ఘటన.... కేసు నమోదు
జవహర్‌నగర్: కాంగ్రెస్ నేత గూండాగిరి ప్రదర్శించాడు. తాను రోడ్డుపై ఉంటే.. హారన్ కొట్టుకుంటూ కారులో వెళ్లాడనే కోపంతో... తన అనుచరులతో అతని ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. కారు అద్దాలు పగులగొట్టి, సామాన్లను కిందపడేసి, మహిళపై చేయిచేసుకున్నాడు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ సైదులు, బాధితుల కథనం ప్రకారం... కీసర మండలానికి చెందిన మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కందాడి స్కైలాబ్‌రెడ్డి సోమవారం దమ్మాయిగూడ లక్ష్మీనగర్‌లో నివాసముంటున్న బంధువు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు నర్సింహారెడ్డి ఇంట్లో వేడుకలకు వెళ్లాడు. అర్ధరాత్రి ఇంటి బయట నిలబడ్డా డు. అదే సమయంలో స్థానికంగా నివాసముంటున్న ప్రసాద్ అనే వ్యక్తి కారు హారన్ కొట్టుకుంటూ వెళ్లాడు. తాను రోడ్డుపై నిల్చుని ఉంటే.. హారన్ కొంటుకుంటూ వెళ్లాడని కోపం పెంచుకున్న స్కైలాబ్‌రెడ్డి తన అనుచరులతో వెళ్లి హారన్ కొట్టిన వ్యక్తి ఇంట్లోకి వెళ్లి వస్తువులు, పూలకుండీలను ధ్వంసం చేశారు. కారు అద్దాలను పగులగొట్టారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ కుటుంబ సభ్యులపై దాడి చేశారు. మహిళ దుస్తులు చించేశాడు. చివరికి ఆ కుటుంబ సభ్యులతో కాళ్లు మొక్కించుకొని వెళ్లిపోయారు. దీంతో బాధితుడు డయల్ 100కు ఫోన్ చేశాడు. ఎస్సై శ్రీనివాస్ వెళ్లి వివరాలు సేకరించాడు. మంగళవారం బాధితుడు ప్రసాద్ జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు స్కైలాబ్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

152
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...