ఓటును అమ్ముకోవద్దు


Tue,November 13, 2018 12:23 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఓటును డబ్బు, మద్యానికి అమ్ముకోవద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చైర్మన్ ఎం.పద్మనాభరెడ్డి సూచించారు. తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ఎలక్షన్ వాచ్ - 2018ను సోమవారం మధ్యాహ్నం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పద్మనాభరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపై ఉందన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌కు సహకరించాలని కోరారు. 30 స్వచ్ఛంద సేవా సంస్థలు కలిసి ఎన్నికల నిఘా వేదిక ఏర్పాటు చేశాయని, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా అది పనిచేస్తుందన్నారు. నియోజకవర్గ స్థాయిలో అధికారులకు సహకరిస్తూ ఓటర్లను చైతన్యం చేస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి 182 వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. వీవీ రావు చెలికాని మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రోజి, రాజేందర్, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ పాల్గొన్నారు.

192
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...