ఎల్వీప్రసాద్ కంటి దవాఖానలో.. కంటి సంరక్షణ వారోత్సవాలు


Mon,November 12, 2018 12:49 AM

బంజారాహిల్స్, నమస్తే తెలంగాణ : పిల్లల కంటి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఎల్వీప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం బంజారాహిల్స్‌లోని దవాఖాన వద్ద అవగాహన వాక్ నిర్వహించారు. ఈ వాక్‌ను ప్రముఖ బాలీవుడ్ నటీ మహి గిల్, ఎల్వీప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వైస్ చైర్మన్ డాక్టర్ జి.చంద్రశేఖర్, చైల్డ్ సైట్ విభాగాధిపతి డాక్టర్ రమేశ్, రెటీనా ఇనిస్టిట్యూట్ అండ్ న్యూ బార్న్ ఐ హెల్త్ అలియన్స్, క్వాలిటీ డైరెక్టర్ డాక్టర్ సుభద్ర జలాలీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు గంటల తరబడి టచ్ స్క్రీన్లను చూస్తూ.. కంప్యూటర్లకు అలవాటు పడటంతో ఈ సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది పిల్లలు మయోఫియా వ్యాధితో బాధపడుతున్నారని, 12.3 లక్షల మంది పిల్లలు అంధత్వంతో బాధపడుతుండగా, అందులో 25 శాతం భారతదేశంలో ఉన్నారన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...