కేపీ వివేకానంద్‌ను పరామర్శించిన ప్రముఖులు


Mon,November 12, 2018 12:48 AM

పేట్‌బషీరాబాద్, జీడిమెట్ల, నవంబర్ 11 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద్ తండ్రి కేఎం పాండు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ ముదిరాజ్‌తో కలిసి వివేకానంద్‌ను ఆయన నివాసంలో పరామర్శించారు. రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన గొప్ప వ్యక్తి మనలో లేకపోవడం బాధకరమని వారన్నారు. ఈ కార్యక్రమంలో స్వామి ముదిరాజ్, ఆగం పాండు, ఆగం రాజు, శంకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
* కేపీ వివేకానంద్‌ను రాష్ట్ర కురుమసంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశ్ కురుమ, కుత్బుల్లాపూర్ కురమసంఘం సభ్యులు ఆదివారం పరామర్శించారు. ఈకార్యక్రమంలో కురుమసంఘం కుత్బుల్లాపూర్ అధ్యక్షుడు నార్లకంటి ప్రతాప్, మల్లేశ్ కురుమ, దుర్గయ్య, గొరిగె నర్సింహ, నార్లకంటి నగేశ్, గొరిగె మధు, బాలయ్య, ఉలిపి వెంకటేశ్, రమేశ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
* ఆదివారం రాత్రి సీఎం కేసీఆర్ తోడల్లుడు అశోక్‌రావు, ఆయన కుమారుడు ప్రశాంత్‌రావులు పరామర్శించారు. ఈకార్యక్రమంలో స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

213
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...