మైనార్టీ మహిళల కోసం దుస్తుల ఉత్పాదక కేంద్రం


Sat,September 22, 2018 12:57 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కట్టుబాట్ల బంధనాలను తెం చుకుని జిల్లాలో మైనార్టీ మహిళలు ముందడుగేస్తున్నారు. వంట ఇంటికే పరిమితం కాకుండా కుటుంబ పోషణకు చేదోడు వాడో దుగా నిలుస్తున్నారు. గార్మెంట్ పరిశ్రమ ద్వారా దుస్తులను తయా రుచేస్తూ ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అండదండలతో వీరంతా తమ సొంతకాళ్లపై నిలబడు తున్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కమ్యూనిటీ టైలరింగ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్ ద్వారా తమను తాము నిరూపించు కుం టున్నారు. వివరాల్లోకి వెలితే.. మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న తెలంగాణ సర్కార్ పెద్ద ఎత్తు నిధు లను మంజూరు చేస్తున్నది. నిధుల వెచ్చింపుతో పాటు నైపుణ్య శిక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఇలా జిల్లాలో 5 కుట్టుమిషన్ శిక్షణా కేంద్రాలను నెల కొల్పి మహిళలకు శిక్షణనందిస్తున్నది. శిక్షణపొందిన తర్వాత వీరంతా సొంతంగా ఉపాధి అవకాశాలను వెతుక్కోవడానికి ఇబ్బం దులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకున్న ఫైనాన్స్ కార్పొ రేషన్ కేవలం శిక్షణతోనే చేతులుదులుపుకోకుండా, శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పించేందుకు దుస్తుల ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. నగరంలోని బాయ్స్‌టౌన్ ఐటీఐ కాలేజీ, జహ నుమాలో కమ్యూనిటీ టైలరింగ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్ పేరుతో ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవలే రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్, వీసీ అండ్ ఎండీ వహీద్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మహ్మద్ ఖాసీంలు ఈ ఉత్పాదక కేంద్రాన్ని ప్రారంభించారు.

పీస్ వర్క్ ద్వారా అర్డర్లు సేకరించి మహిళలకిచ్చి దుస్తులను తయా రుచేస్తున్నారు. దుస్తుల తయరీ పరిశ్రమలో ఉన్న వారి నుంచి ఆర్డర్లు తీసుకుని మహిళల ద్వారా దుస్తులను ఉత్పత్తి చేస్తున్నారు. దుస్తుల తయారీ కోసం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులే ఉచితంగా కుట్టుమిషన్లను అందజేశారు. ఒక్కో మిషన్‌కు రూ. లక్ష వెచ్చించి, మొత్తం 30 అత్యాదునిక కుట్టుమిషన్లను అందించారు. ఈ సెంటర్ నిర్వహణను ఒక ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పగిం చారు. ఈ సంస్థ పర్యవేక్షణలో ప్రస్తుతానికి 30 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఆర్డర్లు తీసుకోవడం, మహిళలకు పని అందజేయడం, దుస్తులను డెలివరీ చేయడం లాంటి పనులన్నిం టిని ఆయా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులే చూసుకుంటున్నారు. దీని ద్వారా ఒక్కో మహిళ రోజుకు సరాసరిగా రూ. 300 పైచిలుకు సంపాదించడం గమనార్హం. మొత్తంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొ రేషన్ అధికారుల చొరవ ఫలితంగా మైనార్టీ మహిళలు ఉపాధి దొరికి ధైర్యంగా బతకగలుతున్నారు. ఇలాంటిని మరికొన్ని ఉత్పా దక కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు మైనార్టీ సంక్షేమశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

193
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...