అల్వాల్ ఘటనపై విచారణకు ఆదేశం


Thu,September 20, 2018 02:18 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అల్వాల్ సర్కిల్ సహాయ పట్టణ ప్రణాళికాధికారి మాధవిపై బల్దియా అనుబంధ కార్పొరేటర్ జ్యోతి దాడికి పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించాలని మేయర్ బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రఘుప్రసాద్‌ను ఆదేశించారు. ఇటీవల విధి నిర్వహణ సందర్భంగా మాధవిపై జ్యోతి దాడికి పాల్పడిన ఘటనకు నిరసనగా బుధవారం సీసీపీ దేవేందర్‌రెడ్డి నేతృత్వంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు మేయర్‌ను కలిసి ఫిర్యాదుచేశారు. దీనిపై మేయర్ స్పందిస్తూ విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని జోనల్ కమిషనర్‌ను కోరారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై భౌతిక దాడులకు పాల్పడడం సహించరానిదని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మేయర్ పేర్కొన్నారు. జోనల్ కమిషనర్ నివేదిక అందిన తరువాత తదుపరి చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

173
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...