ముమ్మరంగా ఓటర్ల ప్రక్షాళన


Wed,September 19, 2018 12:46 AM

-జాబితా నుంచి అనర్హుల తొలిగింపు
-200 మంది అధికారుల పర్యవేక్షణ
-జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ జిల్లాలోని 15అసెంబ్లీ స్థానాల ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో డబుల్ ఎంట్రీ ఓట్లు 75,654, మరణించినవారి ఓట్లు 1.22
లక్షలు, చిరునామా మారిన ఓట్లు 11,974 ఉన్నాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. వీటిలో అర్హతలేని ఓటర్లను జాబితానుంచి తొలిగిస్తున్నామని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం నియమించిన ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు, 15మంది తహసీల్దార్లు, 100మంది వీఆర్వోలతో ఆయన సమావేశమయ్యారు.

హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలకు చెందిన ఓటర్ల జాబితాలో డబుల్ ఎంట్రీ ఓట్లు- 75654, 2014 నుంచి మరణించినవారి ఓట్లు- 1.22లక్షలు, చిరునామా మారిన ఓట్లు 11974 ఓట్లు ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. వీటిల్లో అర్హతలేని పేర్లను జాబితా నుంచి తొలగించి జాబితాను ప్రక్షాళన చేయనున్నట్లు ఆయన చెప్పారు. చిరునామా మారిన ఓటర్ల విషయంలో చర్యలు తీసుకునేందుకు బూత్ లెవల్ అధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం కమిషనర్ ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం నియమించిన ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు, 15మంది తహసీల్దార్లు, 100మంది వీఆర్వోలతో ఆయన సమావేశమై, మాట్లాడారు.

ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం జీహెచ్‌ఎంసీలో పని చేస్తున్న ఏడుగురు ఐఏఎస్ అధికారులు, ఇతర సీనియర్ అధికారులు, జోనల్ కమిషనర్లు సహా మొత్తం 200మంది అధికారుల పర్యవేక్షణ ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ల జాబితాలో పేరు ఉన్నదీ, లేనిది తెలుసుకోవడంతోపాటు ైక్లెములు, అభ్యంతరాలు సమర్పించాలని కోరుతూ నగరంలోని 10,36,000మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఎస్‌ఎంఎస్‌లు పంపినట్లు తెలిపారు. ఇటీవల ఎన్నికల సంఘం ఈఆర్ ఓనెట్ 2.5 పేరుతో అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చినట్లు, దీంతో డబుల్ ఎంట్రీ ఓట్లను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఒకటికన్నా ఎక్కువచోట్ల ఓటరుగా నమోదైతే అట్టివారికి నోటీసులు జారీచేసి వారు కోరుకున్నచోట ఓటుహక్కును ఉంచుతూ మిగిలిన చోట్ల తొలగిస్తామని కమిషనర్ వివరించారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...