కాలుష్యం లెక్కింపునకు పీసీబీ షెడ్యూల్


Thu,September 13, 2018 12:11 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గణేష్ నవరాత్రుల్లో నమోదయ్యే కాలుష్యాన్ని లెక్కించడానికి పీసీబీ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇం దుకోసం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. హుస్సేన్‌సాగర్ సహా, గ్రేటర్‌లోని 21 చెరువుల్లో కాలుష్యస్థాయిలను లెక్కించేందుకు పీసీబీ సైంటిఫిక్ విభాగం షెడ్యూల్‌ను ఖరారుచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించి నీటి శాంపిళ్లను సేకరించనున్నారు. ఈ నీటిశాంపిళ్లను ప్రయోగశాలల్లో పరిశీలించకా కాలుష్య స్థాయిల తేల్చి ఫలితాలను వెల్లడించనున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులను ఆదేశాల మేరకు తెలంగాణ పీసీబీ అధికారులు నిమజ్జన కొలనుల్లో నీటి నాణ్యతా పరీక్షలను నిర్వహించబోతున్నారు. నవరాత్రుల్లో జరిగే విగ్రహాల నిమజ్జనాన్ని బట్టి కాలుష్యస్థాయిల్లో తేడాలుండే అవకాశముండటంతో రోజు విడిచి రోజు చొప్పున శాంపిళ్లను సేకరించనున్నారు. మొత్తం మూడు సార్లుగా విభజించి నీటినాణ్యతలను పరీక్షించనున్నారు. నిమజ్జనానికి ముందు, నిమజ్జనం కొనసాగుతున్న రోజుల్లో, నిమజ్జనం ముగిసిన తర్వాత ఇలా మూడుమార్లు పరీక్షలను నిర్వహించబోతున్నారు. నిమజ్జనం కొనసాగుతున్న రోజుల్లో మూడు, ఐదు, ఏడు, 11 రోజుల్లో శాంపిల్స్ సేకరించి శాస్త్రీయంగా పరీక్షించనున్నారు. నీళ్లల్లోని రసాయనాలను పరీక్షించేందుకు రెండు లీటర్ల నీటి శాంపిళ్లను , ఆక్సిజన్‌స్థాయిలను తెలుసుకునేందుకు లీటర్ క్యాన్ నీళ్ల శాంపిల్‌ను, భారలోహాల స్థాయిని తెలుసుకునేందుకు మరో లీటర్ క్యాన్‌ల ద్వారా శాంపిల్‌ను సేకరించి కాలుష్య తీవ్రతలను పరీక్షించబోతున్నారు.

153
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...