గణేశ్, మొహర్రం పండుగల ట్రాఫిక్ ఏర్పాట్లపై సమీక్ష


Mon,September 10, 2018 12:50 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రానున్న గణేష్ చతుర్థి, మెహర్రం పండుగలకు సంబంధించి బందోబస్తూ, రూట్ క్లియెరెన్స్ తదితర అంశాలపై ట్రాఫిక్ విభాగంలోని ఇన్‌స్పెక్టర్‌పై స్థాయి అధికారులతో ఆదివారం నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ సిబ్బందికి గణేశ్ పండుగ, అనంతరం జరిగే నిమజ్జన కార్యక్రమాలపై దిశా నిర్ధేశం చేశారు. ప్రస్తుతం గణేశ్ విగ్రహాలను తరలించే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ ఏడాది హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని, స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడక్కడ విగ్రహాలు ప్రతిష్టిస్తున్నారు ? నిమజ్జనానికి వాళ్లు ఏ రూట్‌లో వెళ్తున్నారనే సమాచారాన్ని సేకరించాలని సూచించారు. అందుకు తగ్గట్టుగా ఆయా రూట్లలో ఇన్‌చార్జీలను ఏర్పాటు చేసుకొని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేస్తున్న బందోబస్తు వివరాలు, ఆయా ర్యాంకు అధికారులకు ఎక్కడక్కడ బందోబస్తు బాధ్యతలు అప్పగించారనే విషయాలను ఆయాన ఆరా తీశారు. ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కల్గించకుండా తగిన ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలన్నారు, స్పెషల్ ఫ్లాటూన్ రిజర్వు ఫోర్స్‌ను అక్కడ ఏర్పాటు చేస్తామని, వారు ట్రాఫిక్ పోలీసులకు సహకారం అందిస్తారన్నారు. కార్యక్రమంలో డీసీపీలు ఎల్.ఎస్.చౌహాన్, కె.బాబురావు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

169
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...