వేర్వేరు చోట్ల ముగ్గురు మహిళలు అదృశ్యం


Mon,September 10, 2018 12:36 AM

ఉద్యోగానికి వెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని...
దోమలగూడ, సెప్టెంబర్ 9 : సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అదృశ్యమైన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నాగమయ్యకుంట సెక్టర్ ఎస్సై ఈశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం...చిక్కడపల్లి వీఎస్టీ ప్రధాన రోడ్డు సమీపంలో ఉన్న నాగమయ్యకుంటలో నివసించే ఎం.రజిని (30) ఉప్పల్‌లో ఉన్న జెన్‌ప్యాక్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థలో కొంత కాలంగా ఉద్యోగం చేస్తుంది. ఇదిలా ఉండగా ఈ నెల 6న ఉదయం పదిన్నర గంటలకు రోజు మాదిరిగానే ఉద్యోగానికి వెళ్లిన ఆమె సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు.దీంతో ఆందోళనకు గురైన రజిని కుటుంబ సభ్యులు తెలిసిన వారితో పాటు ఆమె స్నేహితులను వాకబు చేసినా ఆచూకీ లభించలేదు.ఆదివారం చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించిన ఆమె తమ్ముడు వినోద్ కుమార్ తన సోదరి అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...