వందలో పది మందికి శ్వాస సంబంధిత వ్యాధులు


Sun,September 9, 2018 12:44 AM

-యశోద ఎండీ జీఎస్‌రావు
అమీర్‌పేట్: దేశంలో పది శాతం మంది ప్రజలు ఆస్తమా లేదా సీవోపీడీతో బాధపడుతున్నారని, మూడు మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన న్యుమోనియాతో 2.7 మిలియన్ల మంది పల్మనరీ టీబీ వ్యాధులతో బాధపడుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయని యశోద వైద్యశాల ఎండీ జీఎస్‌రావు చెప్పారు. శ్వాసకోశ వ్యాధులకు జరిగే చికిత్స విధానాల్లో చోటు చేసుకుంటున్న ఆధునిక మార్పులపై వైద్యులకు అవగాహన కల్పించేందుకు పల్మో అప్‌డేట్స్ పేరుతో తొలి అంతర్జాతీయ లైవ్ వర్క్‌షాప్ శనివారం అమీర్‌పేట్‌లోని హోటల్ మారీగోల్డ్‌లో జరిగింది. సోమాజీగూడ యశోద వైద్యశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్‌షాప్‌కు దేశ నలుమూలల నుంచి పల్మనాలజీ విభాగానికి చెందిన వైద్యులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. యశోదా వైద్యశాల ఎండీ జీ.ఎస్.రావు రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవనశైలిలో చోటు చేసుకుంటున్న మార్పులు, పర్యావరణ కాలుష్యం, వంటి అనేక కారణాలు న్యూమోనియా, టీబీ, ఆస్తమా, సీవోపీడీ వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులతో పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు గురి చేస్తున్నాయన్నారు.శరవేగంగా పెరుగుతున్న ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి, అందుబాటులోకి వస్తున్న వ్యాధి నిర్ధారణ పద్ధతులపై వైద్యులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. అందుకే పల్మో అప్‌డేట్స్ పేరుతో ఈ వర్క్‌షాప్ నిర్వహించడం జరుగుతున్నదన్నారు. ఈ వర్క్‌షాప్‌నకు దాదాపు 500 మంది పల్మనాలజీ విభాగం వైద్యులు దేశ నలుమూలల నుంచి విచ్చేస్తున్నారని చెప్పారు. ప్రముఖ పల్మనాలజీ నిపుణులు డాక్టర్ వి.నాగార్జున మాటూరు, డాక్టర్ ఎంవీ.రావు, డాక్టర్ నవనీత్ సాగర్‌రెడ్డి, డాక్టర్ ప్రతిభ పాల్గొన్నారు.

174
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...