- ఎన్నికల సమరంలో టీఆర్ఎస్ దూకుడు
- ప్రచార పర్వంలోకి దిగిన అభ్యర్థులు
- మరోసారి ఆశీర్వదించాలంటూ ప్రజాక్షేత్రంలోకి..
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: శాసనసభ రద్దు నుంచి అభ్యర్థుల ప్రకటన వరకు వ్యూహాత్మకంగా ముందుకెళ్లిన సీఎం కేసీఆర్.. ఎన్నికల సమరంలోనూ దూకుడు పెంచేశారు. ఇందులో భాగంగా శుక్రవారం గ్రేటర్‌లోని మెజార్టీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. శ్రావణమాసం చివరి శుక్రవారం మంచి రోజు అని భావించి.. తొలుత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ విజయాన్ని ఆకాంక్షించారు. అనంతరం నియోజకవర్గ ముఖ్యులు, కార్పొరేటర్లు, సీనియర్ నేతలతో సమావేశాలు నిర్వహించి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. నాలుగున్నరేండ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతి, సంక్షేమ పథకాలు .. హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ప్రణాళికలను ప్రజలకు వివరించేందుకు కదనరంగంలోకి దిగారు. మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. మొదటిరోజే అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిం చడంతో గ్రేటర్‌లోని అన్ని నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండా ఎగురుతుందని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అన్ని పార్టీల కంటే ముందుగానే టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలోకి దిగడంతో ప్రతిపక్షాలు డైలామాలో పడ్డాయి.
ఎన్నికల సమరంలో టీఆర్ఎస్ దూకుడు మీదుంది. ప్రతిపక్షాలకు అంచనాలకు తలకిందులు చేస్తూ అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ ప్రచార పర్వంలోనూ కారు స్పీడ్‌ను పెంచారు. ఇందులో భాగంగానే గ్రేటర్లో మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులు తొలి రోజూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. శ్రావణమాసం చివరి శుక్రవారం మంచి రోజూ అని భావించిన అభ్యర్థులు ఆలయాల్లో తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ విజయాన్ని కాంక్షిం చారు. పూజల ఆనంతరం నియోజకవర్గ ముఖ్యులు, కార్పొరేటర్లు, సినీయర్ నేతలతో అభ్యర్థులు సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ సత్తా చాటేలా అన్ని అందరినీ సమన్వయం చేసుకుంటునే మరో పక్క ప్రజాక్షేత్రంలోకి దిగారు. డివిజన్, కాల నీ, బస్తీల వారీగా ప్రచార కార్యచరణ ప్రణాళికను రూపకల్పన చేస్తున్నారు. నాలుగున్నర ఏండ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతి, మునుపెన్నడూ లేని విధంగా హైదరాబాద్ అభి వృద్ది, మెట్రో, ఎస్ఆర్డిపి పథకాలతో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చడం, సంక్షేమ పథకాల్లోనూ మెజార్టీ హైదరాబాద్ వాసులే లబ్ధిదారులు ఉండడం, హైదరాబాద్ నగ రాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు 50వేల కోట్లతో చేపట్టే ప్రణాళికలను ప్రజలకు వివరించేందుకు అభ్యర్థులు ఎన్నికల కదనరంగంలోకి దిగారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టారు. తొలి రోజూ అభ్యర్థుల నియోజకవర్గాల్లో ప్రత్యేక సందడి వాతావరణం కనిపించింది. పార్టీ నేతలు, శ్రేణులు, వచ్చి వెళ్లే అభిమానులతో అభ్యర్థులు బిజీ బీజీగా గడిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాలు, అభ్యర్థుల ఇంట గులాబీమయమైంది. ప్రచారంలో భాగంగా నాంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్‌కుమార్‌గౌడ్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి ఆనంతరం ప్రచారం చేపట్టారు. దర్బార్ మైసమ్మ ఆలయంలో జీవన్‌సింగ్ పూజలు నిర్వహించారు. తిరుమలగిరి ఎస్పీ కాలనీ నల్లపోచమ్మ ఆలయంలో కంటోన్మెంట్ నియోజకవర్గ అభ్యర్థి సాయన్న ప్రత్యేక పూజలు చేపట్టారు. ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ స్వర్ణధామనగర్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం లో కూకట్పల్లి అభ్యర్థి మాధవరం కృష్ణారావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆనంతరం టీచర్స్ కాలనీలోని చర్చిలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హస్మ త్పేటలోని బడే మసీదులో ప్రార్థనలు చేసి అక్కడి నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రా రంభించారు. చేవెళ్లలోని శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో అభ్యర్థి కాలె యాదయ్య తమ మొక్కులు తీర్చుకున్నారు .యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలోగల నందీశ్వరాలయంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన నందివనపర్తి గ్రామంలో కార్యకర్తల సమా వేశం నిర్వహించారు కాగా తొలి రోజూ ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ప్రజల నుంచి ఆపూర్వ ఆదరణ లభించింది. గ్రేటర్‌లోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ జెండా ఎగురుతుందని టీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎన్నికల సమరంలో కారు స్పీడ్‌కు ప్రతిపక్షాలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాయి. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులు ఏకంగా ప్రచారంలోకి దిగడంతో డైలామాలో పడ్డారు. ఉనికే లేని టీడీపీ పొత్తుల కోసం ఆరాటపడుతుంటే, ఇక ఢిల్లీ నాయకత్వంలో పనిచేసే కాం గ్రెస్ పార్టీ కనీసం మెజార్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం జల్లెడ పడుతున్న తీరు ఉం దని, ఈ రెండు పార్టీలు టీఆర్ఎస్ ముందు నిలబడే పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేష కులు అభిప్రాయపడుతున్నారు.