గల్ఫ్‌ పేరిట మోసాలకు పాల్పడితే చర్యలు


Thu,December 5, 2019 01:10 AM

మెట్‌పల్లి టౌన్‌: గల్ఫ్‌కు పంపే వ్యవహారంలో అమాయకులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని మెట్‌పల్లి సీఐ రవికుమార్‌ హెచ్చరించారు. బుధవారం రాత్రి ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న గల్ఫ్‌ ఏజెంట్‌ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో నలుగురు ఎస్‌ఐలతో కలిసి నాలుగు గ్రూపులుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆరు పాస్‌పోర్టులను స్వా ధీనం చేసుకున్నారు.

కొత్త బస్టాండ్‌ వద్ద ఉన్న ఓ ట్రావెల్స్‌లో గల్ఫ్‌కు పంపే వ్యవహారంలో వినియోగిస్తున్న ఒక సీపీయూ, ఒక మానిటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ రవికుమార్‌ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా గల్ఫ్‌ ఏజెంట్‌ కార్యాలయాలను ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. నిబంధనలను అనుసరించి గల్ఫ్‌ కేంద్రాలను నడుపాలనీ, నకిలీ వీసాలు ఇప్పిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం ఎస్‌ఐలు కిరణ్‌కుమార్‌, షకీల్‌, అశోక్‌, నారాయణబాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...