రైతులకు వెన్నుదన్నుగా ప్రభుత్వం


Thu,December 5, 2019 01:10 AM

-ఆధునిక పద్ధతులను పాటించాలి
-ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి
-మేలురకపు విత్తనాలను ఎంచుకోవాలి
-అవగాహన సదస్సుల్లో రైతులకు వ్యవసాయశాఖ అధికారుల సూచనలు

బోయినపల్లి: రైతులకు ప్రభుత్వం వెన్ను దన్నుగా ఉం టున్నదని మండల వ్యవసాయ అధికారిణి ప్రణీత కొ నియాడారు. మండలంలోని మల్కాపూర్‌, వెంకట్రావ్‌పల్లి, రత్నంపేట గ్రామాల్లో యాసంగి పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సులను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పని చేస్తున్నదని, అందుకే యాసంగి పంటల సాగు పై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తుందని చెప్పారు. రైతులందరు సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సదస్సుల్లో వ్యవసాయ అధికారులు చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తే అధిక దిగుబడి వ స్తుందని తెలిపారు. ప్రభుత్వం అందించే సబ్సిడీలను స ద్వినియోగం చేసుకుని పంటలను సాగు చేయాలని చెప్పా రు. సదస్సుల్లో సర్పంచ్‌లు రంగి రేణుక, బూర్గుల నంద య్య, నరేష్‌, ఏఈవోలు రజిత, వైష్ణవి, టీఆర్‌ఎస్‌ నేతలు అమిరిశెట్టి భూంమ్‌రెడ్డి, రింగి తిరుపతి ఉన్నారు.

స్పల్పకాలిక పంటలను ఎంచుకోవాలి
చందుర్తి: మండలంలోని మర్రిగడ్డ, తిమ్మాపూర్‌ గ్రా మాల్లో యాసంగి సాగుకు సమాయత్తంపై అవగాహన కా ర్యక్రమాన్ని మండల వ్యవసాయాధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు యా సంగిలో స్వల్ఫకాలిక రకాలు వేసుకోవాలని, నాటేముం దు విత్తనశుద్ధి చేసుకోవాలని, చలి సమస్యను అధిగమించడానికి తీసుకోవాలసిన తగు జాగ్రత్తల పై వివరించారు. మొక్కజొన్న పంటలో కత్తెరపురుగు నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు నేతికుంట జలపతి, అట్టపల్లి రమ్య, ఎంపీటీసీలు దా రం కావ్యశ్రీ, వేల్పుల వనజ, నాయకులు బాల్‌రెడ్డి, వ్య వసాయ విస్తరణాధికారులు రమ్య, శిరీష, రైతు సమన్వ య సమితి సభ్యులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

సబ్సిడీలను వినియోగించుకోవాలి
కోనరావుపేట: మండలంలోని వెంకట్రావుపేట, కొం డాపూర్‌, బావుసాయిపేట గ్రామాల్లో యాసంగి పంటలపై రైతులకు మండల వ్యవసాయ అధికారిణి వెంకట్రావమ్మ ఆవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాసంగి సాగులో విత్తనం ఎంచుకోవడమే కీలకమని తెలిపారు. పంట సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. సబ్సిడీ యంత్రాలు, ఎరువులు, విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కా ర్యక్రమంలో సర్పంచ్‌లు సంతోష్‌, దేవయ్య, గంగాధర్‌, ఎంపీటీసీలు మంజుల, యాస్మిన్‌ పాషా, ఉపసర్పంచ్‌లు రవీందర్‌గౌడ్‌, దేవరాజు, ఏఈవో జహేద్‌ పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...