సిరిసిల్ల రూరల్: టీఎస్-ఐపాస్ ప్రవేశపెట్టి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఎస్సీ, ఎస్టీలకు రూ.305కోట్ల నిధులను విడుదల చేయడంపై టీఆర్ఎస్ నేత, ఎస్టీ సెల్ జిల్లా నాయకుడు భూక్య రెడ్యనాయక్, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు కొంపెల్లి మహేశ్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో బుధవారం నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే రాష్ర్టానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. పరిశ్రమలను ప్రోత్సహించడంతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని సం తోషం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీల పారిశ్రామిక వేత్తలకు రూ. 305 కోట్లు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. మంత్రికేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.