జనగణనకు కసరత్తు పూర్తి చేయాలి


Thu,December 5, 2019 01:09 AM

జిల్లాలో 2020-21 జనాభాకు సంబంధించి అన్ని మండలాల, గ్రామాల, పట్టణ మ్యాప్‌లను సిద్ధం చేయాలని, ఎలాంటి ఒత్తిళ్లకు పొరపాట్లకు తావు లే కుండా చూడాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ వెల్లడించారు. తొలి విడత వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు, తుది విడత 2021 ఫిబ్రవరిలో జనగణన చేపట్టాలని, మొదటి విడత 45 రోజులపాటు గ్రామీణ, పట్టణాల్లోని నివాస గృహా లు, జాతీయ జనా భా రిజిస్టర్‌ ప్రకారం వివరాలు సేకరించాల్సి ఉంటుందని తెలిపారు. తుదివిడత సర్వే 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు 20 రోజులపాటు జరపాలని, రెండో విడత సర్వేలో జనాభాను మాత్రమే లెక్కించాలని అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా పూర్తి స్థాయిలో సర్వేను నిర్వహిం చాలని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రసెన్సెస్‌ డీడీ సుబ్బరాజు, డీఆర్వో ఖి మ్యానాయక్‌, సీపీవో రాజారాం, కమిషనర్‌ సమ్మయ్య పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...