ఇతర జిల్లాలకు ఇసుక రవాణా నిలిపివేత


Thu,December 5, 2019 01:08 AM

కలెక్టరేట్‌: మధ్యమానేరు జలాశయంలో 20 టీఎంసీలకు నీటి నిల్వ ఉన్నందున దృష్ట్యా ఇసుక పూడికతీత కార్యక్రమాలు టీఎస్‌ఎండీసీ నిలిపివేయనుంది. ఫలితంగా ఇకపై ఇతర జిల్లాలకు ఇసుక రవాణా నిలిపివేస్తున్నామని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ వెల్లడించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా రెవెన్యూ అధికారి ఖిమ్యానాయక్‌, మైనింగ్‌ అధికారులతో కలిసి జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ ఇకపై ఇతర జిల్లాలకు కాళేశ్వరం పనులకు, 2 బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణాల ని మిత్తం ఇసుక రవాణా నిలిపివేస్తామని స్పష్టం చేశారు.

స్టాక్‌యార్డులోని కొద్దిపాటి కూడా ఆర్‌అండ్‌ఆర్‌ అనంతగిరి, ప్యాకేజీ-9 మల్కపేట రిజర్వాయర్‌ ప నులకు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. టీఎస్‌ఎండీసీ స్టాక్‌యార్డులో ఇసుక లభ్యత లేని దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈలు, 2బీహెచ్‌కే ఇంజినీర్లు ఎలాంటి దరఖాస్తులు పెట్టవద్దని స్పష్టం చేశారు. 2బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణాల నిమిత్తం ఇసుక పర్మిట్లు ఇప్పటికే జారీ చేసి ఉన్నా, ఇసుక రవాణా జరగని పక్షంలో సంబంధిత అర్జీదారులు చెల్లించిన లోడింగ్‌ రుసుములను తిరిగి వా పస్‌ చేయనున్నామని తెలిపారు. విషయాన్ని గమనించి ప్రజలు జిల్లా యం త్రాంగానికి సహకరించాలని కోరారు. స్థానిక ప్రజల అవసరాల నిమిత్తం ట్రా క్టర్ల ద్వారా స్థానిక రీచ్‌ల నుంచి ఇసుక రవాణాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్వో ఖిమ్యానాయక్‌, గనుల శాఖ ఎడి సైదులు, టీఎస్‌ఎండీసీ పీవో తారక్‌నాథ్‌రెడ్డి, జిల్లా ఇరిగేషన్‌ అధికారి అమరేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ ఈఈ కనకరత్నం పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...