వేములవాడను సుందరీకరిస్తాం


Thu,December 5, 2019 01:08 AM

-ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
-అధికారులతో సమీక్షా సమావేశం
-ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తిచేయాలని ఆదేశం

వేములవాడ, నమస్తేతెలంగాణ: వేములవాడ పట్టణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఉద్ఘాటించారు. మున్సిపల్‌ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, వాటి పురోగతిపై సంబంధిత అధికారులతో జేసీ, మున్సిపల్‌ ప్రత్యేకాధికారి యాస్మిన్‌బాషాతో కలిసి ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రధాన రహదారుల విస్తరణను పూర్తి చేయాలని రోడ్లు, భవనాలశాఖ అధికారులను ఆదేశించారు. మూలవాగుపై మొదటి వంతెన పూర్తయినందున దాని పనులను కూడా పూర్తిచేయాలన్నారు. మూలవాగు ఒడ్డు నిర్మిస్తున్న స్మృతివనం పనులను కూడా వేగవంతం చేయాలన్నారు. పనుల పూర్తికి మరో రూ.80లక్షలు అవసరమని అధికారులు తెలపగా, నివేదికలను రూపొందిస్తే మంజూరి చేయిస్తానన్నారు.
అదేవిధంగా వీలిన గ్రామా ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, కూడళ్ల సుందరీకరణ పనులను 10రోజుల్లో పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. స మస్యలను తన దృష్టికి తీసుకురావాలని, సత్వరమే పరిష్కరించేందుకు కృ షి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ విఘ్నేశ్వర్‌రెడ్డి, డీఈ సురేశ్‌బాబు, ప్రజాఆరోగ్యం డీఈ ప్రసాద్‌, మిషన్‌ భగీరథ డీఈ సురేశ్‌కుమార్‌, తాసీల్దార్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ ఏఈలు శ్రావణ్‌కుమార్‌, నర్సింహాస్వామి, పట్టణ ప్రణాళిక పర్యవేక్షకులు అంజయ్య, మేనేజర్‌ తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు లయన్స్‌ క్లబ్‌ సన్మానం
వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబును లయన్స్‌క్లబ్‌ సభ్యులు ఘనంగా సన్మానించారు. సంగీత నిలయంలో ఎమ్మెల్యేను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. లయన్స్‌క్లబ్‌ భవన నిర్మాణానికి సహకరించాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే రమేశ్‌బాబు సానుకూలంగా స్పందిం చడమేగాక, తగు హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను వారు ఘనంగా సత్కరించి, జ్ఞాపికను, మొక్కను అందజేశారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు నాగరమేశ్‌, జిల్లా కోర్‌కమిటీ సభ్యులు తీగల వెంకటేశ్వర్‌రావు, ఉపాధ్యక్షుడు చిట్టి రామారావు, నిజాం నరేందర్‌, ఉమారాజిరెడ్డి, ఆరేటి గిరిబాబు, మోటూరి మధు, రైకనపేట శ్రీనివాస్‌, వంగపల్లి ప్రశాంత్‌, తోట నర్సయ్య, నరాల శే ఖర్‌, రాపెల్లి శ్రీధర్‌, బాశెట్టి శ్రీనివాస్‌, నగుబోతు చంద్రమౌళి, గంప రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...