సర్కారు బడిలో నూతన ఒరవడి


Sun,November 17, 2019 01:35 AM

- ఏకరూప దుస్తుల్లో బోధన
- మర్రిగడ్డ ప్రాథమిక పాఠశాలలో డ్రెస్‌కోడ్
- ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులు
- కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన విద్య

చందుర్తి : సర్కార్‌బడిలో చదివే విద్యార్థులకు ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన అందిస్తూ మండలంలోని మర్రిగడ్డ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికే గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నది. మర్రిగడ్డలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూనే ఉపాధ్యాయులు కూడా ఏకరూప దు స్తులు, ఐడీ కార్డులతో పాఠశాలకు హాజరవుతున్నా రు. ఐకమత్యాన్ని చాటుతూ, విద్యార్థుల్లో స్నేహభావాన్ని పెంపొందించడమే కాకుండా ఉత్తమ కృత్యాధార పద్ధతిలో బోధన అందిస్తున్నారు. వినూత్న రీతిలో, సులభతరంగా విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠ్యాంశాలను చెబుతున్నారు.

అందరూ సమానం అనే ఉద్దేశంతో..
అందరూ సమానులే అనే భావన కలగడమే కాకుండా ఐక్యమత్యాన్ని చాటేలా విద్యార్థులకు డ్రెస్‌కోడ్ ఉంటుంది. ఉపాధ్యాయులు ఒక అడు గు ముందుకు వేస్తూ విద్యార్థులతో మమేకం కావడానికి వారు కూడా ఏకరూప దుస్తులను ధరించి పాఠాలు బోధిస్తున్నారు. మర్రిగడ్డ ప్రాథమిక పాఠశాలలో శిశు నుంచి 5వతరగతి వరకు విభిన్నరీతిలో, నూతన పద్ధతులలో బోధన అందించడమేకాకుండా, విద్యార్థులకు మరింత చేరువకావడానికి కృషిచేస్తున్నారు. విద్యలో సరికొత్త మెళుకువలను పాటిస్తున్నారు.

స్నేహభావం పెంపొందించడానికే...
విద్యలో అంతా సమానమే అన్న భావనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు స్నేహభావంతో మెలగాలని టీచర్లు ఏకరూప దుస్తులను ధరిస్తున్నారు. రోజూ పాఠశాలకు యూనిఫామ్ వేసుకొని రావాలనే ఆలోచన తీసుకరావలన్న ఉద్దేశంతో విద్యార్థులను మానసికంగా సిద్ధంచేస్తున్నారు.

ఏకరూప దుస్తులతో అంకితభావం..
అంకితభావంతో విద్యను బోధించాలని ఉపాధ్యాయులు ఏకరూప దుస్తులను ధరిస్తున్నారు. హుం దాతనాన్ని, క్రమశిక్షణను అలవర్చుకుంటూ వి ద్యార్థులకు స్ఫూర్తిదాతలుగా నిలుస్తున్నారు. విద్యను బోధించేవారు.. అభ్యసించేవారు సమానమంటూ సరికొత్త ఒరవడికి నాంది పలికారు. స ర్కార్ బడికి వచ్చే విద్యార్థులు కార్పొరేట్‌స్థాయిలో విద్యను అందుకోవాలనే లక్ష్యంతో ముందుకువస్తున్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...