గ్రంథాలయాలతో విజ్ఞానం


Sun,November 17, 2019 01:32 AM

సిరిసిల్ల టౌన్: విద్యార్థులు గ్రంథాలయాలను వినియోగించుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా పరిషత్ సీఈవో గౌతంరెడ్డి సూచించారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా గ్రంథాలయంలో విద్యార్థులకు ఉపన్యాస పోటీలను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ సీఈవో ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చా రు. ప్రతి విద్యార్థీ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. రోజువారీగా పత్రికల్లో వచ్చే స్థానిక, రాష్ట్రీ య, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ముఖ్య వార్తలను విద్యార్థులు చదవాల్సిన అవసరముందని వివరించారు. విద్యార్థులు పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలని, అలాంటప్పుడే జ్ఙాపకశక్తి, మేధోశక్తి పెరుగుతుందన్నారు.

ఉద్యోగాల కోసం శిక్షణ పొందే అభ్యర్థులకు గ్రంథాలయం మంచి అవకాశమని తెలి పారు. ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛభారత్‌లో ప్రతి విద్యార్థీ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయ పరిషత్ జిల్లా చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయంలో విజయవంతంగా వారోత్సవాలను నిర్వహిస్తున్నామని వివరించారు. విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు. అనంతరం జడ్పీ సీఈ వో గౌతంరెడ్డిని గ్రంథాలయ చైర్మన్ శంకరయ్య ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రచయిత వాసరవేని పర్శరాములు, గ్రంథాలయ కార్యదర్శి శంకరయ్య, లైబ్రేరియన్ మాధవి, తదితరులు పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...