ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి


Sun,November 17, 2019 01:32 AM

ముస్తాబాద్: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని షెడ్యూల్డ్ కుల స్తులు ఆర్థికంగా ఎదగాలని ఎస్సీ కార్పొరేషన్ జిల్లా కార్యనిర్వాహక సంచాలకురాలు రాజేశ్వరీ సూచించారు. మండలంలోని బందనకల్ గ్రామంలో సర్పంచ్ వెంకటేశ్వరి, ఉప సర్పంచ్ కార్తీక్‌రెడ్డి, ఎంపీటీసీ రాంచెంద్రరెడ్డితో కలసి గ్రామంలోని షెడ్యూల్డ్ కులానికి చెందిన కుటుంబాలతో సమావేశం నిర్వహించారు. వారి ఆర్థిక స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న భూపంపిణీ, నైపుణ్యాల శిక్షణ, పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపడుతు న్న పందిరి సాగు, ఇతరత్ర స్వయం ఉపాధి పథకాలపై అవగాహన కల్పించా రు. కార్యక్రమంలో నాయకులు నారాగౌడ్, వెంకటస్వామి, శివనందం, దేవిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉద్యోగులు ప్రశాంత్‌కుమార్, మధు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...