రాజీతోనే సమస్యలు పరిష్కారం


Sun,November 17, 2019 01:31 AM

సిరిసిల్ల లీగల్: రాజీతోనే సమస్యలు పరిష్కారమవుతాయని సిరిసిల్ల 9వ అదనపు జిల్లా జడ్జి జాన్సన్ తెలిపారు. జిల్లా పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లతో సిరిసిల్ల కోర్టులో శనివారం ప్రత్యేక సమావేశాన్ని ఆయన నిర్వహించా రు. మెగా లోక్ అదాలత్ నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 14న సిరిసిల్ల కోర్టులో మెగా లోక్ అదాలత్‌ను వినియోగించుకొనేలా కక్షిదారులు చైతన్యపరచాలని తెలిపారు. జిల్లాలో రాజీకి వీలయ్యే పెండింగ్ క్రిమినల్ కేసులు 828 ఉన్నాయని తెలిపారు. వాటిని పరిష్కరించేలా ప్రయత్నాలు చేయాలని సూచించారు.

కక్షిదారులు అనవసర ప ట్టింపులకు వెల్లవద్దని, సమయాన్ని, డబ్బును వృథా చేసుకోకుండా రాజీ కుదుర్చుకొని కేసులను పరిష్కరించుకునే దిశగా ఆలోచించాలని కోరారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శంకర శ్రీదేవి, లోక్ అదాలత్ మెంబర్ చింతోజు భాస్కర్, సీఐలు, ఎస్‌ఐలు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...