ఔట్ సోర్సింగ్ సిబ్బందికీ డ్రెస్‌కోడ్


Sat,November 16, 2019 12:35 AM

-ఆదేశాలు జారీచేసిన ఈవో
-రాజన్న ఆలయంలోని వివిధ విభాగాల్లో అమలు
-బ్లూ, గ్రీన్, మెరూన్, ఖాకీ డ్రెస్‌లతో విధులకు హాజరు

వేములవాడ, నమస్తేతెలంగాణ: రాష్ట్రంలోనే ప్రము ఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఆలయ అధికారులు డ్రెస్‌కోడ్‌ను అమ ల్లోకి తీసుకువచ్చారు. 227మంది వివిధ విభాగాల్లో పనిచేస్తుండగా ఒక్కో విభాగానికి ఒక్కో రకమైన డ్రెస్‌ను గుర్తించి ఆలయ కార్యనిర్వాహణాధికారి కృష్ణవేణి అమలుకు ఆదేశించారు. దీంతో సిబ్బంది విధిగా డ్రెస్‌తో విధులకు హాజరవుతుండగా పనిచేస్తున్న విభాగం, సదరు విధులకు హాజరయ్యే వారి ఫోటోతో కూడా గుర్తింపుకార్డులను అందజేశారు. రాజన్న ఉద్యోగులతో పాటు సిబ్బందికి కూడా డ్రెస్‌కోడ్ అమలు చేయగా వచ్చే భక్తులకు గుర్తింపు సులభతరం కాగా విధుల పట్ల అం కితభావంతో పనిచేసే విధానం ఉంటుందని ఆలయ కార్యనిర్వాహణాధికారి వెల్లడించారు.

రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్ష్రేతం..
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి క్షేత్రం రాష్ట్రంలోనే అతిపెద్ద శైవక్షేత్రం. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు స్వామివారి సన్నిధికి తరలివస్తుంటారు. యేటా కోటిన్నరమంది భక్తులు స్వా మివారి సన్నిధికి వస్తుండగా వారి సౌకర్యార్థం అనేక విభాగాలు పనిచేస్తుంటాయి. ఇందులో రెగ్యులర్ ఉద్యోగాలతో పాటు ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే ఉద్యోగులు కూడా ఉన్నారు. దాదాపు 500లమంది వరకు మొత్తం మంది పనిచేస్తుంటారు.

పలు విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిన విధులు
రాజన్న ఆలయంలోని పలు విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిన సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా లడ్డూ ప్రసాదం తయారీ, తరలింపు, సానిటేషన్, ఎలక్ట్రికల్, పంపుఆపరేటర్స్, గోశాలలో, సేవదారులు ఇలా 227మంది సిబ్బంది ఈ విభాగాల్లో పనిచేస్తుంటారు. ఇక రెగ్యులర్ ఉద్యోగులు కూడా 280 మంది విధులు నిర్వహిస్తుంటారు.

సిబ్బందికి సైతం..
వేములవాడ రాజన్న ఆలయంలో పనిచేస్తున్న ఉ ద్యోగులకు ఇప్పటికే డ్రెస్‌కోడ్ విధానం అమలులో ఉంది. రెగ్యులర్ ఉద్యోగులు తెల్లటి దుస్తులతో వి ధులకు హాజరవుతుంటారు. ఈ పద్ధతినే ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా డ్రెస్‌కోడ్‌ను అమలు చేశారు. ఇందులో భాగంగా పనిచేస్తున్న విభాగానికి అనుగుణంగా బ్లూ,గ్రీన్, మెరూన్, ఖాఖీ డ్రెస్‌కోడ్‌ను అమలు చేశారు. డ్రెస్ తో పాటు సిబ్బందికి గుర్తింపుకార్డులను కూడా జారీచేశారు. గుర్తింపుకార్డులో సిబ్బంది పనిచేస్తున్న విభాగం, నియామకమైన సంస్థ పేరును కూడా పొందుపరిచారు. ఇక పురుషులు ధరించే చొక్కాల పై కూడా వారి విధులు, పనిచేస్తున్న సం స్థ, సిబ్బంది హాజరయ్యే విభాగం పేరును కూడా పేర్కొన్నారు. డ్రెస్‌కోడ్‌తో విధుల పట్ల అంకితభావం, క్రమశిక్షణ, గుర్తింపు ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...