రైతులకు పరిహారం చెక్కుల అందజేత


Sat,November 16, 2019 12:33 AM

కోనరావుపేట: విద్యుత్ టవర్ల ఏర్పాటుతో భూమి ని కోల్పోయిన రైతులకు సెస్ సంస్థ ద్వారా మం జూరైన చెక్కులను శుక్రవారం సెస్ డైరక్టర్ దేవరకొండ తిరుపతి అందజేశారు. మండలంలోని మల్కపేటంలో ఏడుగురు రైతులు భూములు కో ల్పోగా మూడో విడుతగా రూ.1లక్ష 15వేల విలు వ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు నిరంతర కరెంట్‌ను అందిస్తున్నదని కొనియాడారు. లోవోల్టేజీ సమస్యతో ఇబ్బంది కలుగకుండా సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తుందన్నారు. పెద్దూరులోని ప్ర ధాన విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి నిమ్మపల్లి 132/33కేవి సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరాకు విద్యుత్ టవర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో ఆయా గ్రామాల్లో పట్టా కలిగిన రైతులు తమ పంట భూములను కోల్పోయారని పేర్కొన్నారు. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆ మేరకు వారికి పరిహారం అందించామన్నారు.

రూ.8. 79 లక్షల చెక్కులు అందజేత...
పెద్దూరులో కేటీఆర్ సహకారంతో నిర్మిస్తున్న 220కేవీ సబ్‌స్టేషన్ నుంచి నిమ్మపల్లిలో ఏర్పాటు చేసిన 132/33కేవీ సబ్‌స్టేషన్‌కు కరెంట్ సరఫరా చేశారు. ఈక్రమంలో చిన్నబోనాల, పెద్ద బోనాల, కొలనూర్, మర్తనపేట, ధర్మారం, మల్కపేట, ని జామాబాద్, వెంకట్రావుపేట, కొండాపూర్ గ్రా మాల మీదుగా టవర్లను ఏర్పాటు చేశారు. త ద్వారా భూములు కోల్పోయిన 52మంది రైతులకు నష్టపరిహారం కింద రూ.8లక్షల 79వేల విలువ గల చెక్కులు అందించినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో సర్పంచ్ అరె లత, ఉప సర్పంచ్ జవ్వాజి అంజయ్యగౌడ్, టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు ఉత్తేమ్ శ్రీనివాస్, వార్డు సభ్యు డు వెల్పుల మహిపాల్ తదితరులు ఉన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...