ఉపాధితో పల్లెల వికాసం


Sat,November 16, 2019 12:33 AM

ఎల్లారెడ్డిపేట: పల్లెల వికాసానికి ఉపాధి హామీ పథకం ఎంతగానో తోడ్పడుతున్నదని ట్రైనీ కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం మండలంలోని హరిదాస్‌నగర్‌లో పర్యటించారు. ఎంపీడీవో చిరంజీవితో కలిసి ఈజీఎస్ కింద చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్మశానవాటికలు, డంపింగ్ యా ర్డులు, ఇంకుడుగుంతలు, క్యాటిల్‌షెడ్లు, కిచెన్‌షెడ్లు తదితర నిర్మాణాలకు ఈజీఎస్ నిధులను వినియోగిం చు కో వాలని పాలకవర్గాలకు సూచించారు. ఆయన వెంట ఏపీవో కొమ్రయ్య, సర్పంచ్ తెడ్డు అమృత, ఫీల్డ్ అసిస్టెం ట్ పులిరాజు, తెడ్డురాజమల్లు, తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...