పుస్తకపఠనంతో మేధోశక్తి పెంపు


Sat,November 16, 2019 12:32 AM

-బాలసాహితీవేత్త కందేపి రాణిప్రసాద్
సిరిసిల్ల టౌన్: పుస్తక పఠనంతో చిన్నారుల్లో మేధోశక్తి పెంపొందుతుందని కవయిత్రి, బాలసాహితీవేత్త డాక్టర్ కందేపి రాణిప్రసాద్ తెలిపారు. తాను రచించిన టిక్ టాంబుర్ర అనే బాలల కథల పుస్తక సంపుటిని జిల్లా కేంద్రంలోని సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్‌లో చిన్నారులతో కలిసి ఆమె శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవయిత్రి రాణిప్రసాద్ మాట్లాడుతూ.. బాలల దినోత్సవ వేడుకలు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. జ్వరం, తదితర అనారోగ్య కారణాలతో బాధపడుతున్న చిన్నారుల్లో ఆ వేడుకల్లో పాల్గొనలేకపోతున్నామన్న బాధను తొలగించాలన్న ఉద్దేశ్యంతో వారితోనే పుస్తకావిష్కరణ జరిపించినట్లు వివరించారు. దీంతో చిన్నారులు చాలా సంతోషం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. నవలలు, కథలను చదవడం ద్వారా చిన్నారుల్లో ఉత్సాహం పెరుగుతుందన్నారు, అదేవిధంగా చదువుపైనా ఆసక్తి కనబరుస్తారని తెలిపారు. అనంతరం డాక్టర్ కందేపి ప్రసాద్‌రావు చిన్నారులకు పలు పుస్తకాలను బహుమతిగా ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైద్యశాల నిర్వాహకుడు సృజన్ సింధూర్, డాక్టర్ రవికుమార్, దేవయ్య, వెంకటేశం, రవి, సత్యనారాయణ, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...