పనుల్లో నాణ్యత పాటించాలి


Sat,November 16, 2019 12:32 AM

సిరిసిల్ల రూరల్: సిరిసిల్ల నూతన వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణంలో నాణ్యతను పాటిస్తూ, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వరంగల్ మార్కెటింగ్ ఈఈ లక్ష్మణ్‌గౌడ్ సూచించారు. సర్దాపూర్‌లో 20 ఎకరాల స్థలంలో రూ.20కోట్ల నిధులతో కొనసాగుతున్న ఆధునిక సిరిసిల్ల మార్కెట్ యార్డు నిర్మాణ పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. పనులు సాగుతున్న తీరును, మార్కెట్ యార్డు నమూనా మ్యాపును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదునిక వసతులతో మార్కెట్ యార్డును నిర్మిస్తున్నామ ని వెల్లడించారు. నిర్ణీతకాలంలో పనులను పూర్తిచేయాలని సూచించారు. ఆయన వెంట జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి షాబొద్దీన్, సిరిసిల్ల ఏఎంసీ అధ్యక్షురాలు లింగంరాణి, డీఈ మునిందర్, ఏఎంసీ కార్యదర్శి సుజన్ బాబు, అధికారులు తదితరులున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...