సిరిసిల్లలో దేశంలోనే మోడ్రన్ లైబ్రరీ


Sat,November 16, 2019 12:32 AM

సిరిసిల్ల టౌన్: మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ వల్లే జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో అత్యాధునిక వసతులతో దేశంలోనే మోడ్రన్ లైబ్రరీ అందుబాటులోకి వచ్చిందని జాయింట్ కలెక్టర్ యాస్మిన్‌బాషా వివరించారు. పట్టణంలోని సినారె గ్రంథాలయంలో నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం ఏర్పాటుచేసిన పుస్తక ప్రదర్శనను జేసీ ప్రారంభించారు. గ్రంథాలయాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన పుస్తకాలను పరిశీలించారు. ప్రదర్శనకు విచ్చేసిన విద్యార్థులతో ముచ్చటించా రు. అనంతరం జేసీ యాస్మిన్‌బాషా మాట్లాడుతూ.. సినా రె జిల్లా గ్రంథాలయంలో అన్ని పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను పాఠకులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహనీయుల చరిత్రను భావితరాలకు అందించేందుకు ఉపయోగపడే పుస్తకాలు, స్వాతంత్రోద్యమ నేపథ్యం, తెలంగాణ ఉద్యమం, కవి, రచయితల సంపుటాలను ఏర్పాటు చేశారని వివరించా రు.

ఉద్యోగార్థులకు, పాఠకులకు ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాల ఏర్పాటుపై కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడించారు. మంత్రి కేటీఆర్ సూచనతో ఇప్పటికే రూ.5లక్షలతో పలు పుస్తకాలను సమకూర్చారని గుర్తుచేశారు. గ్రంథాలయ పరిషత్ జిల్లా చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ సౌజన్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా అధునాతన లైబ్రరీని సిరిసిల్లలో నిర్మించుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు. డిజిటల్ లైబ్రరీ, స్టడీ రూం, కంప్యూటర్ గది, సెమినార్ హాల్‌తో పాటు లిఫ్ట్ సౌకర్యం అందుబాటులో ఉన్నదని తెలిపారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సెక్రెటరీ శంకరయ్య, జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జనపాల శంకరయ్య, లైబ్రేరియన్ మాధవి, సిబ్బంది, పాఠకులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...