డబుల్ బెడ్ రూం నిర్మాణాలను సత్వరమే చేపట్టాలి


Sat,November 16, 2019 12:32 AM

గంభీరావుపేట: పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మా ణాలను గ్రామాల్లో సత్వరమే చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి ఖిమ్యానాయక్ సూచించారు. గంభీరావుపేట మండలంలోని గోరంటాల, దమ్మన్నపేట, కోళ్ల మద్ది గ్రామాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. ప్రభుత్వం నిర్మించనున్న ఇండ్ల నిర్మాణాల స్థలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని సూచించారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా గుర్తించిన ప్రభుత్వ భూముల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులు, గుత్తేదారులకు డీఆర్వో ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అనువైన స్థలాలు లేకపోవడం వల్ల ఇప్పటికే నిర్మాణంలో జాప్యం జరిగిందని, వెంటనే నిర్మాణ పనులు ప్రా రంభించాలని వారు సూచించారు. అదేవిధంగా లింగన్నపేట, దేశాయిపేట గ్రా మాల్లో నిర్మాణం చేస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను డీఆర్వో పరిశీలించి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాలు తుదిదశకు చేరాయని వెల్లడించారు. ఆయన వెంట ఏఈ భాస్కర్‌రెడ్డి, ఆర్‌ఐలు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామరెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...