యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి


Fri,November 15, 2019 02:46 AM

-సమయానుకూలంగా పనులు నిర్వహించాలి
-నిర్వాసితులు సహకరించాలి
-సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్
-సర్జ్‌పుల్, సబ్‌స్టేషన్ నిర్మాణాల పరిశీలన

ఇల్లంతకుంట : అధిక వర్షాలతో జాప్యం జరిగిందని, మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. మండలంలోని తిప్పాపూర్ గ్రామ శివారులో గల కాళేశ్వరం 10వ ప్యాకేజీలో నిర్మిస్తున్న సర్జిపుల్, సబ్‌స్టేషన్ పనులను గురువారం పరిశీలించారు. ఆమెకు మొదట కలెక్టర్ కృష్ణ భాస్కర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగ తం పలికారు. అనంతరం స్మితా సబర్వాల్ మా ట్లాడుతూ తెలంగాణలో బీడు భూములను సాగులోకి మార్చడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులను ప్రారంభించారని గుర్తుచేశా రు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురవడంతో కాంట్రాక్టర్లు సమయానుకూలంగా చేయలేకపోయారని, పనుల్లో వేగం పెంచాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం జరగక పోవడంతో శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌కు సర్జిపుల్ ద్వారా వచ్చే నీటి తరలింపు నిలిచిపోయిందన్నారు. ఎత్తిపోతలకు సిద్ధంగా ఉన్న బాహుబలి మోటార్లను, గేట్లను పరిశీలించా రు. కార్యక్రమంలో కాళేశ్వరం ఈఎన్‌సీలు హరిరామ్, ఇరిగేషన్ మురళీధర్ రావు, సీఈ అజయ్ కుమార్, ఎస్‌ఈ ఆనంద్, పెంటారెడ్డి, శ్రీనివాస్ రావు, బీహెచ్‌ఈఎల్ మోహన్, ఈఈ దేవేందర్ రెడ్డి, డీఈఈ దేవేందర్, ఏఈఈ సమరసేన, తాసిల్దార్ రాజరెడ్డి, ప్రాజెక్టు ఏఈలు పాల్గొన్నారు.

నిర్వాసితులు సహకరించాలి
డిసెంబర్ మొదటి వారంలో శ్రీరాజరాజేశ్వర జలాశయం జలాలు అన్నపూర్ణ రిజర్వాయర్‌కు తరలించనున్నామని, నిర్వాసితులను తరలించాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్‌కు సీఎంవో ముఖ్య కార్యదర్శి స్వితా సబర్వాల్ సూచించారు. అన్నపూర్ణ ప్రాజెక్టులోని బండ్ 3 పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఈ డిసెంబర్ 1 నాటికి మండలంలోని అనంతగిరి గ్రామస్తులను వారికి కేటాయించిన స్థలాలకు పంపించాలన్నారు. మిగిలిన పనులు పూర్తి చేసి వెంటనే ప్రాజెక్టుకు జలకళ తీసుకురావాలన్నారు.
95 శాతం ప్యాకేజీ.. : కలెక్టర్
అన్నపూర్ణ ప్రాజెక్టు ముంపు బాధితులు ప్రభుత్వం అందించిన పునరావాస ప్యాకేజీని 95 శాతం మంది అందుకున్నారని కలెక్టర్ కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. స్వచ్ఛందంగా ముందుకు రాని 74 మందికి చట్ట ప్రకారం పునరావాస ప్యాకేజీ ఇచ్చి ఖాళీ చేయించనున్నట్లు చెప్పారు. శ్రీరాజరాజేశ్వర జలాశయానికి గాయత్రీ పంపు హౌస్ ద్వారా రోజూ 12.500 క్యూసెక్కుల నీరు వరద కాలువ ద్వారా వస్తున్నదన్నారు. ఈ నెల చివరి వారంలోగా ఎస్‌ఆర్‌ఆర్ జలాశయం 25 టీఎంసీల నీటితో పూర్తి స్థాయి జలకళ సంతరించుకుంటుందన్నారు. మండలంలోని 30 వేల ఎకరాలకు సాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముంపు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...