మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలి


Fri,November 15, 2019 02:44 AM

సిరిసిల్ల టౌన్ : ప్రభుత్వం కల్పిస్తున్న పత్తి మ ద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాల ని జిల్లా మార్కెటింగ్ అధికారి షాబొద్దీన్ సూచించారు. గురువారం సిరిసిల్లలో ఏర్పాటుచేసిన స మావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని కో నరావుపేట మండలంలో గల కావేరి కాటన్ జిన్నింగ్ మిల్ (సుద్దాల), వేములవాడ మండలంలోని నాంపల్లిలో గల శ్రీలక్ష్మీ నరసింహ మిల్, సంకెపల్లిలో గల లక్ష్మీ ఇండస్ట్రీస్ మిల్‌ల వద్ద పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపా రు. ఆయా కేంద్రాలలో 14 మంది రైతుల నుంచి 247 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. పత్తి పంటకు ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాల్ (మొదటి రకం)కు రూ.5550, రెండో రకం పత్తికి రూ.5450 అందిస్తున్నదని చెప్పారు. తేమ 8 నుంచి 12 శాతం ఉన్న పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వా రా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. సీసీఐ సూ చించిన నిబంధనలు పాటించి కొనుగోలు కేంద్రాలలోనే పత్తిని విక్రయించి, ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలని ఆయన కోరారు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దని రైతులకు సూ చించారు. మార్కెటింగ్, సీసీఐ సిబ్బంది ఉన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...