జమ్మూకు కలెక్టర్


Fri,November 15, 2019 02:43 AM

కలెక్టరేట్ : కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లద్దాక్‌లలో సుపరిపాలనలో అత్యుత్తమ విధానాలపై నిర్వహించనున్న రెండు రోజుల ప్రాంతీయ సదస్సుకు కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన గురువారం జమ్మూకాశ్మీర్‌కు బయలు దేరి వెళ్లారు. సుపరిపాలనలో అత్యుత్తమ విధానాలపై పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల కేంద్ర మంత్రిత్వ శాఖ జమ్మూ, కాశ్మీర్ ప్రభుత్వం సౌజన్యంతో జమ్మూ, కాశ్మీర్, లద్దాక్ కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ నెల 15, 16 తేదీలలో ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో 16న మిషన్ ఇంద్రధనస్సుపై కలెక్టర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. తమ ఆలోచనలు విశిష్ట అతిథులతో పంచుకునేందుకు వీలుగా కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు కేంద్ర ఉప కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఆహ్వానం అందింది. ప్రాంతీయ సదస్సులో పాల్గొనేందుకు ప్రభుత్వ అనుమతితో కలెక్టర్ గురువారం సాయంత్రం జమ్మూకు బయలుదేరారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...