ప్రభుత్వ పాఠశాలలో భలే భోజనశాల


Wed,November 13, 2019 02:53 AM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాల ఆవరణలోని వరండా, చెట్ల కింద కూర్చొని తినేవారు. బంగారు తెలంగాణలో భాగంగా మంత్రి కేటీఆర్‌ సహకారంతో గజసింగవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులందరూ సామూహికంగా కూర్చొని మధ్యాహ్న భోజనం చేసేందుకు వీలుగా పాఠశాల ఆవరణలో భోజనశాలను ఏర్పాటు చేశారు. సీఎస్‌ఆర్‌ నిధులు ద్వారా గివ్‌ తెలంగాణ ఫౌండేషన్‌ ద్వారా పాఠశాలలో సుమారు 200మంది విద్యార్థులు భోజనశాలలో కూర్చొని తినేవిధంగా 12లక్షలతో భోజన శాల పూర్తి చేశారు.

మంత్రి కేటీఆర్‌ సహకారంతో..
మంత్రి కేటీఆర్‌ సహకారంతో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారుతున్నాయి. విద్యార్థులకు పాఠ్యంశాలు సులభంగా అర్థమయ్యే విధంగా తరగతి గోడలపై వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన బొమ్మలతో పాటు విద్యార్థులను ఆకర్షించే విధంగా రంగులు వేస్తున్నారు. గజసింగవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సీఎస్‌ఆర్‌ నిధులు, గివ్‌ తెలంగాణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 12లక్షలతో సామూహిక భోజనాల శాల ఏర్పాటు చేశారు. దీంతో చెట్లు, పాఠశాల వరండాల మధ్య కూర్చొని మధ్యాహ్న భోజనం చేసేందుకు విద్యార్థులకు ఇబ్బందులు తప్పాయి.

ఆదర్శంగా గజసింగవరం పాఠశాల
గజసింగవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల జిల్లాలోనే ఆదర్శంగా నిలించింది. గివ్‌ తెలంగాణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పాఠశాలలో మధ్యాహ్న భోజన శాల ఏర్పాటు చేశారు. ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సామూహికంగా మధ్యా హ్న భోజనం తినేవిధంగా భోజనశాల ఏర్పాటు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంబురపడుతున్నారు.

పాఠశాలలో కొత్త అనుభూతి
పాఠశాలలో అందరితో కలిసి కూర్చొని మధ్యాహ్న భోజనం చేయడంతో విద్యార్థులకు కొత్త అనుభూతి కలుగుతుంది. శుభకార్యక్రమం సందర్భంగా ఫంక్షన్‌ హాల్‌లో కూర్చొని తింటున్నారు. తరగతులకు అతీతంగా బాలబాలికలు కలిసి పాఠశాలలో భోజనం చేస్తూ సంతోషపడుతున్నారు. ఇంటిని మైమరపించే విధంగా స్నేహితులతో కలిసి భోజనం చేయడాన్ని విద్యార్థులు అదృష్టంగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఎంతో సదుపాయంగా ఉంది
మంత్రి కేటీఆర్‌ సహకారంతో పాఠశాలలో ఏర్పాటు చేసిన సామూహిక భోజనశాల విద్యార్థులకు ఎంతో సదుపా యంగా ఉన్నది. గతంలో విద్యార్థులు చెట్ల కింద, వరండాలలో కింద కూర్చొని తినేవారు. గివ్‌ తెలంగాణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజన శాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నరు.
- అంజయ్య, హెచ్‌ఎం, గజసింగవరం

ఇంటిని మైమరపించేలా..
పాఠశాలలో ఏర్పాటు చేసిన సామూహిక భోజనశాలలో తోటి స్నేహితులతో కలిసి తినడం ఇంటిని మైమరపించే విధంగా ఉంది. దీంతో మధ్యాహ్నం భోజనం వడ్డించే వాళ్లకు కూడా ఇబ్బందులు తప్పాయి. ఒకేచోట కూర్చొని తినడం సంతోషంగా ఉంది.
- అనురిద్‌, 7వ తరగతి, గజసింగవరం

కలిసి తింటున్నం
స్నేహితులతో కలిసి సామూ హికంగా మధ్యాహ్న భోజనం తింటున్నం. గతంలో వర్షం పడినప్పుడు భోజనం చేయా లంటే ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు రుచికర మైన భోజనాన్ని హాయిగా కలిసి తింటున్నం.
- ఐశ్వర్య, 10వ తరగతి విద్యార్థిని

కొండూరి ప్రత్యేక చొరవతో..
టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు సహకారంతో మా పాఠశాలను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దుకుంటు న్నం. రవీందర్‌రావు తన యుడు సాకేత్‌రావు చొరవతో పాఠశాలలో భోజనశాల ఏర్పాటు చేసిన్రు. భోజనశాలను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చిన్రు.
- సుతారి బాలరాజు, సర్పంచ్‌, గజసింగవరం

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...