ఎములాడ కిటకిట


Tue,November 12, 2019 04:25 AM

-పోటెత్తిన రాజన్న ఆలయం -40 వేలకు పైగా భక్తుల రాక
-సమకూరిన 24 లక్షల ఆదాయం
-నేడు జ్వాలాతోరణం.. దీపోత్సవం

వేములవాడ కల్చరల్: కార్తీక సోమవారం సందర్భంగా వే ములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుంచే భక్తులు పవిత్ర ధర్మగుండంలో స్నానాలు ఆచరించారు. కోడెమొక్కు తీర్చుకున్నారు. లైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నా రు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో భక్తులు నిర్వహించుకునే ఆర్జితసేవలను అధికారులు రద్దుచేశారు. ఆలయంలో వివిధ ఆర్జితసేవల ద్వారా ఆలయానికి సుమారు రూ.24 లక్షల ఆదాయం సమకూరినట్లు, రాజన్నను సుమారు 40 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయ ఈవో కృష్ణవేణి ఆధ్వర్యంలో ఏఈ వో ఉమారాణి, పర్యవేక్షకులు నటరాజ్, సిరిగిరి శ్రీరాములు, ఇన్‌స్పెక్టర్స్ రాజశేఖర్, భూపతిరెడ్డి భక్తులకు ఏర్పాట్లు చేశారు.

నేడు జ్వాలాతోరణ దర్శనం
కార్తీక పౌర్ణమి సందర్భంగా రాజన్న ఆలయంలో రాత్రి 7 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం పార్వతీ రాజరాజేశ్వర స్వామివారిని, శ్రీలక్ష్మీసమేత అనంతపద్మనాభ స్వామివారిని అందంగా అలంకరించి ప ల్లకీసేవలో కూర్చుండబెడతారు. ఆలయ అర్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయం ఎదుట భా గంలో జ్వాలాతోరణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామ ని ఈవో కృష్ణవేణి తెలిపారు. కార్తీక జ్వాలాతోరణ దర్శనంతో జాతి భేదం లేకుండా మానవులకు, కీటకాలకు, ప క్షులకు, దోమలకు, జలచరాలైన చేపలు మొదలైన వాటికే కాక వృక్షాలకు కూడా పునర్జన్మ ఉండదని చెబుతారు. కార్తీకమాసం పౌర్ణమి ఘడియల్లో జ్వాలాతోరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాజన్న ఆలయ అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...