శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి


Tue,November 12, 2019 04:23 AM

సిరిసిల్ల ఎడ్యుకేషన్: విద్యార్థులు చిన్ననాటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులూ ప్రోత్సహించాలని జి ల్లా విద్యాధికారి రాధాకిషన్ సూచించారు. జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల(శివనగర్)లో జిల్లా స్థాయిసైన్స్ డ్రామా ఫెస్టివల్ పోటీలను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఈవో ము ఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విజ్ఞాన శాస్త్రం- సమాజం ప్రధాన ఇతివృత్తంగా ఈ పోటీలను నిర్వహించామని వెల్లడించారు. మొత్తం ఏడు పాఠశాలల (ప్రభుత్వ, ప్రైవేట్) నుంచి సుమారు 56 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారని వెల్లడించారు. ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులను ఈ నెల 18న నిర్వహించ నున్న ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర, జాతీయ స్థా యిల్లో జిల్లా తరుపున మంచి ప్రతిభ కనబరచాలని విద్యార్థులకు ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో ఎన్‌సీఎస్‌సీ కో ఆర్డినేటర్ అనురాధ, డీఎస్‌వో ఆంజనేయులు పాముల దేవయ్య, శంకర్, శ్రీదేవి, కృ ష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...