విదేశాలకు తెలంగాణ విత్తనాలు


Tue,November 12, 2019 04:23 AM

ముస్తాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అందిస్తున్న ప్రోత్సాహకా ల వల్ల విదేశాలకు విత్తనాలు ఎగుమతి చేసేస్థాయికి రాష్ట్రం చేరుకుందని తెలుగు రాష్ర్టాల విత్తనోత్పత్తి దారుల సంఘం కోశాధికారి చేరాలు సంతోషం వ్యక్తం చేశారు. మండలంలోని పలు గ్రామాల రైతులు తొలిసారి బహుబలి- 22 రకం వరి విత్తనాలు వేసి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించారు. వారిని తెర్లుమద్దిలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఘనంగా సన్మానించి అనంతరం మాట్లాడారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల రైతులు సాగులో ఆధునిక పద్ధతులను, మేలైన వంగడాలను వాడుతూ లాభాలను పొందుతున్నారన్నారు. మూడున్నరే ళ్లు పరిశోధనలు చేసి బహుబలి-22 లావు రకం వరి విత్తనాన్ని రూపొందించారని వెల్లడించారు. యూరప్ దేశాలు బంగ్లాదేశ్ నుంచి విత్తనాలను దిగుమతి చేసుకుంటున్నా వాటిని ఔషధాల తయారికే వినియోగిస్తున్నారన్నారు. బహుబలి రకం విత్తనాలు, ఎకారానికి 15 కిలోలు సరిపోతాయని, 115 నుంచి 125 రోజుల్లో పంట చేతికందుతుందని, అధిక దిగుబడి వస్తుందని వివరించారు. ఈ రకం విత్తనాలు బీహార్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌ఘడ్ రైతులు ఎక్కువగా సేద్యం చేస్తున్నారని తెలిపారు. రైతులకు ఆ విత్తనంపై అవగాహన కల్పించారు. అనంతరం గతంలో వేసి అధిక దిగుబడులు సాధించిన రైతుల అభిప్రాయాలు తెలుసుకొని వారిని సన్మానించారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...