ప్రజాదివస్‌పై సత్వర చర్యలు: ఎస్పీ


Tue,November 12, 2019 04:23 AM

సిరిసిల్ల క్రైం: ప్రజాదివస్ ఫిర్యాదుల పరిష్కారా నికి సత్వరమే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రాహుల్‌హెగ్డే వెల్లడించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్‌లో ఆయన పాల్గొని స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారుల స మస్యలను ఎస్పీ ఓపికతో విని, వాటి పరి ష్కారా నికి వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసుశాఖ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజాదివస్‌ను ప్రతి సోమవారం ఉద యం 11నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ని ర్వహిస్తూ ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని వెల్ల డించారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజాదివస్‌లో తొలిసారిగా 17 అ ర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...