14వ తేదీ నుంచి గ్రంథాలయ వారోత్సవాలు


Tue,November 12, 2019 04:23 AM

సిరిసిల్లటౌన్: గ్రంథాలయ వారోత్సవాల ను ఈ నెల 14నుంచి 20వ తేదీ వరకు నిర్వ హించనున్నారు. ఈ మేరకు జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆకునూరి శంకరయ్య వెల్లడించారు. జిల్లా గ్రంథాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. వారం రోజుల పా టు వేడుకలను నిర్వహిస్తామని, అందుకు భా రీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కవి స మ్మేళనం, కళాకారుల ప్రదర్శనలు, ఉపన్యా స, వ్యాస రచన పోటీలు, జిల్లా గ్రంథాలయ ఆవశ్యకతపై అవగాహన సదస్సు తదితర అం శాలపై కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. జిల్లాకు చెందిన కవులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, యువతను భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. 14న కలెక్టర్ కృష్ణభాస్కర్ చేతుల మీ దుగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, 20న ముగింపు కార్యక్రమం ఉంటుందని వివరించారు.

పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహక బహుమతులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సమకూరిన జిల్లా గ్రంథాలయ ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ప్రధాన సంకల్పంతో వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతిభా పాఠవ పోటీల్లో పాల్గొనదలచిన వారు గ్రంథాలయ కార్యదర్శి శంకర య్య, మొబైల్ నంబర్ 97048 93190ను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో గ్రంథాలయ కార్యదర్శి శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...