విద్యార్థికి రామన్న భరోసా..


Mon,November 11, 2019 02:38 AM

-కాలు.. నరాల సంబంధిత వైద్యానికి ఆర్థిక సాయం
-ఆపరేషన్ నిర్వహణకూ వెన్నంటి నిలిచిన మంత్రి కేటీఆర్
-నిమ్స్‌కు తీసుకురావాలని ఆదేశం
-అమాత్యుడికి రుణపడి ఉంటామంటూ యువకుడి కుటుంబీకుల కృతజ్ఞతలు

సిరిసిల్ల రూరల్: తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఇంటర్ విద్యార్థి సద్ద నూతన్ (19) వైద్యానికి మంత్రి కేటీఆర్ భరోసానందించారు. తంగళ్లపల్లికి చెందిన సద్ద ప్రభాకర్ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య సునీత, కొడుకు నూతన్, కూతురుఉంది. గత సెప్టెంబర్ 9న ముస్తాబాద్‌లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదవుతున్న నూతన్ స్నేహితులతో కలిసి ముస్తాబాద్‌కు బైక్‌పై వెళ్లాడు. అక్కడ జాబ్ మేళాలో పాల్గొ ని తిరిగి బైక్ పై వస్తుండగా మార్గమధ్యలో కస్బెకట్కూర్ వద్ద బైక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. కాలుకు బలమైన గాయం కావడంతో సిరిసిల్ల దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉంటే హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. నిమ్స్‌లో వైద్యులు పరీక్షించి, నరాలు చిట్లిపోయాయని చెప్పి ఆపరేషన్ చేశారు. మళ్లీ తర్వాత మరో ఆపరేషన్ ఉంటుందని చెప్పారు. ఇప్పటికే రూ.3లక్షలకు పైగా ఖర్చు అయ్యిందనీ, మళ్లీ ఆపరేషన్‌కు రూ.4లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారనీ, చేతిలో చిల్లిగవ్వ లేదని నూతన్ తండ్రి ప్రభాకర్ వాపోయాడు. ఈ విషయాన్ని సిరిసిల్ల మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు లింగంరాణి, సాంస్కృతిక సారథి కళాకారుడు శ్రీధర్‌రెడ్డి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అమాత్యుడు సత్వరమే స్పందించి, సోమవారం నిమ్స్‌కు తీసుకురావాలని పీఏ మహేందరెడ్డికి సూచించారు. దీంతో నూతన్‌తోపాటు తండ్రి ప్రభాకర్ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...