సమాజసేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలి


Mon,November 11, 2019 02:36 AM

రుద్రంగి: సమాజసేవలో ప్రతి ఒక్కరూ ముం దుండాలని లయన్స్ క్లబ్ ఇంటర్నేషన్ జిల్లా గవర్నర్ విజయ అన్నారు. ఆదివారం రుద్రంగి మం డల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు పర్యావరణం, ప్లాస్టిక్ నిషేధం, డయాబెటిస్, క్యాన్సర్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు సమాజ సేవచేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించాలన్నారు. మొక్కలను పెంచడం వల్ల కలిగే లాభాలను ప్రతి ఒక్కరికీ తెలియజేసేలా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో రుద్రం గి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మరిపల్లి అంతయ్య, సెక్రటరీ పుట్కపు మహేశ్, కోశాధికారి బోయిని గంగాధర్, జిల్లా లయన్స్ క్యాబినెట్ మెంబర్ లయన్ తీపిరెడ్డి వెంకట్ రెడ్డి, జోన్ చైర్ పర్సన్ లయన్ గుగ్గిళ్ల శైలజ, రుద్రంగి లయన్స్ క్లబ్ సభ్యులు అంబటి శంకర్, గడప రఘుపతి రావు, తీగల శశిధర్ రావు, కోటగిరి శ్రీనివాస్, మాడిశెట్టి ప్రభాకర్, బాసని రమేశ్, కొమిరె శంకర్, తిరుపతి, ఎర్రం గంగనర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...