పరిసరాల పరిశుభ్రత పాటించాలి


Mon,November 11, 2019 02:36 AM

బోయినపల్లి : ప్రజల సహకారంతోనే పారిశుధ్య నిర్మూలన సాధ్యమవుతుందని సర్పంచ్ రంగి రేణుక పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని రత్నంపేటలో గ్రామస్తులకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలు సమష్టిగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. చెత్త ను రోడ్లపై పడవేయవద్దన్నారు. ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భా గంగా గ్రామాలు సర్వాంగ సుందరంగా మారాయ న్నారు. ఇదే స్పూర్తిని ప్రజలు కొనసాగించాలన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి స్వప్న, వార్డు సభ్యులు, టీఆర్‌ఎస్ నాయకులు రంగి తిరుపతి తదితరులున్నారు.

21
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...