రైతు సంక్షేమమే ధ్యేయం


Mon,November 11, 2019 02:36 AM

సిరిసిల్ల కల్చరల్: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య అన్నారు. తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. రైతులు అహర్నిషలు కష్టపడి పంటలు పండించి ప్రజలకు తిండిపెడుతున్నారని అన్నారు. ప్రతిఒక్కరూ రైతుల రుణం తీర్చుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా,రైతు బంధు పథకాలతో రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. రైతులు ధర నిర్ణయించే స్థాయికి రావాలని కోరారు. అనంతరం బొడ్డు శంకర్ రచించిన ఉద్యమించుడు భారత యువకులారా రైతు శతకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ సిద్దం వేణు, మాజీ కౌన్సిలర్ పత్తిపాక పద్మ, కవులు డాక్టర్ జనపాల శంకరయ్య, బూర దేవానందం, తెలంగాణ తెలుగు భాషా సంఘం ప్రధాన కార్యదర్శి కందాల కార్తీక్‌రెడ్డి, గోనె శంకర్, సౌమ్య పాల్గొన్నారు.

20
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...