పలువురికి ఎమ్మెల్యే పరామర్శ


Sun,November 10, 2019 01:32 AM

బోయినపల్లి: టీఆర్‌ఎస్ నాయకుడు కొమ్మనబోయిన సువీన్‌యాదవ్ కుటుంబ సభ్యులను చొ ప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శనివారం ప రామర్శించారు. టీఆర్‌ఎస్ నాయకుడు సువీన్‌యాదవ్ తండ్రి మల్లేశ్ యాదవ్ వారం రోజుల క్రి తం మృతి చెందాడు. వారి స్వగ్రామం మండలంలోని శాభాష్‌పల్లి గ్రామం కాగా ముంపు గ్రామం కావడంతో కరీంనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ మేరకు కరీంనగర్‌లోని వారి నివాసంలో పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సర్పంచ్, ఎంపీటీసీల కుటుంబాలకు..
మండలంలోని స్తంబంపల్లి సర్పంచ్ జ్యోతి, ఎంపీటీసీ అక్కెనపల్లి ఉపేందర్‌ల కుటుంబాలను శనివారం రాత్రి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరామర్శించారు. సర్పంచ్ జ్యోతి అత్తమ్మ, మూడు రోజుల క్రితం మృతి చెందారు. ఎంపీటీసీ ఉపేందర్ తండ్రి నర్సయ్య 5 రోజుల క్రితం మృతి చెందారు. ఈ తరుణంలో వారి కుటుంబాలను ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మేడుదుల మల్లేశం, టీఆర్‌ఎస్ నాయకులు సాంబ లక్ష్మీరాజం, జంపుక ఆనంద్, కన్నం సాగ ర్, పలువురు ప్రజా ప్రతినిధులున్నారు.

హోటల్‌లో టీ తాగిన ఎమ్మెల్యే
బోయినపల్లి:బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలోని హోటల్‌లో శనివారం రాత్రి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నా యకులు కార్యకర్తలతో కలసి టీ తాగారు. స్తంబంపల్లిలో సర్పంచ్ జ్యోతి, ఎంపీటీసీ ఉపేందర్ కు టుంబాలను పరామర్శించిన అనంతరం చొప్పదండికి తిరిగి వెళ్తున్న సమయంలో బోయినపల్లి ప్రధాన కూడలిలో కొద్దిసేపు ఆగి టీ తాగారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ప్రచారం సం దర్భంగా పాత జ్ఞాపకాలను, కార్యకర్త లు నాయకులతో కలిసి పంచుకున్నారు. ఆయన వెంట మండల టీఆర్‌ఎస్ నాయకులు బీమనాథుని రమేష్, సంబ లక్ష్మీరాజం, గుంటి శంకర్, జంపుక ఆనంద్, కన్నం సాగర్‌లున్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...