గుడిచెరువు సుందరీకరణకు రూ.6కోట్ల నిధులు మంజూరు


Sun,November 10, 2019 01:32 AM

వేములవాడ, నమస్తేతెలంగాణ: వేములవాడ గుడిచెరువు సుందరీకరణ పనుల కొనసాగింపునకు రూ.6 కోట్ల నిధులను మంజూరు చేసిన సీఎం కేసీఆర్, అందుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్‌కు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రమేశ్‌బాబు మాట్లాడుతూ మిషన్ కాకతీయ పథకంలో భాగంగా ఇప్పటికే రూ 61.35 కోట్లు మంజూరు కాగా, ఈ నిధులతో గుడిచెరువు మట్టికట్టను 150 ఫీట్లకు విస్తరించామని, ఇరువైపులా గైడ్ వాల్స్ నిర్మించామనీ, రాజన్న గుడి ఎదుటనున్న ప్రాం తంలో సుమారు 35 ఎకరాల్లో 6లక్షల క్యూబిక్ మీటర్ల మట్టితో నింపి గుడి అభివృద్ధి ఆలయానికి అప్పగించామని వెల్లడించారు. రాబోయే కాలంలో యాత్రికుల పుణ్యస్నానాల కోసం పుష్కర ఘాట్లను నిర్మించడమేగాక, చెరువు మధ్యలో శివుడి ఐడల్ ఏర్పాటుకు మరో రూ.8 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వివరించారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 6 కోట్ల నిధులను మంజూరు చేశారని తెలిపారు. నిధుల మంజూరు చేసిన సీఎంకు, ప్రత్యేక చొరవ చూపిన మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి నిరంతం పనిచేస్తున్నామని, రాబోయే భక్తులకు అన్ని వసతులను కల్పిస్తామని ఉద్ఘాటించారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...