దళారుల నమ్మి మోసపోవద్దు


Sun,November 10, 2019 01:32 AM

కోనరావుపేట: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొ నుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ సూచించారు. మండలంలోని ఊరుతండా, నిమ్మపల్లి గ్రామం లో ఐకేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేం ద్రాలకు తీసుకొచ్చి విక్రయించాలని సూచించా రు. దళారులకు విక్రయిస్తే మద్దతు ధర దక్కదని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరారు.

సీసీరోడ్ల పనులకు భూమిపూజ
అనంతరం రూ.20లక్షల నిధులతో మర్తనపేటలో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ, రూ.10లక్షల తో బస్టాండ్ ఆవరణలో చేపట్టిన హైమాక్స్ లైట్ల ఏర్పాటు పనులు, రాజన్న గొల్లపల్లిలో రూ.10లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు జడ్పీ అధ్యక్షురాలు అరుణ భూమిపూజ చేశారు. క్య్రాక్రమంలో ఎంపీపీ ఎదరుగుట్ల చంద్రయ్యగౌడ్, సర్పంచ్‌లు వన్నమనేని వంశీకృష్ణారావు, బొజ్జ వసంత, శ్రీనివాస్, ఇస్లావత్ రాములు నాయక్, ఎంపీటీసీలు ప్రవీణ్, భారత, ఉపసర్పంచ్ శ్రీనివాస్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు న్యాలకొండ రాఘవరెడ్డి, రైతు కమిటీ మండల అధ్యక్షుడు ప్ర తాపరెడ్డి, ఏపీఎం దేవరాజు, రవీందర్‌గౌడ్, నర్స య్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...