రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ


Sat,November 9, 2019 04:50 AM

-20 వేలకు పైగా భక్తుల రాక
- 13 లక్షల ఆదాయం

వేములవాడ కల్చరల్ : కార్తీకమాసం సందర్భంగా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆల యం శుక్రవారం భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువజామునే భక్తులు పవిత్ర ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడెమొక్కు తీర్చుకున్నారు. భక్తులు క్యూలైన్లలో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో భక్తులు అభిషేకపూజలు,అన్నపూజలు,ఆకులపూజలు, గండదీపం,పలకీసేవలు, పెద్దసేవలు,కల్యాణాలమొక్కులు,సత్యనారాయణవ్రతాలు నిర్వహించుకున్నారు. కల్యాణాల మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో వివిధ ఆర్జితసేవల ద్వారా రాజన్నకు సుమా రు 13 లక్షల ఆదాయం సమకూరినట్లు ,రాజన్నను సుమారు 20 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.

రాజన్నను దర్శించుకున్న కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి
వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారిని శుక్రవారం కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి యన్. వి.దుర్గాప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట వేములవాడ మండల విద్యాధికారి కోయల్‌కార్ సురేశ్ ఉన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...