డిగ్రీ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తాం


Sat,November 9, 2019 04:49 AM

కలెక్టరేట్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని డీఆర్వో ఖిమ్యానాయక్ అన్నా రు. శుక్రవారం ఆయన డీఆర్వో కార్యాలయంలో అగ్రహారం, గంభీరావుపేట కళాశాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో విద్యాభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచాలని సూచించారు. అగ్రహారం డిగ్రీ కళాశాలకు మంజూరు చేసిన ఎస్సీ బాలికల వసతిగృహం, మధ్యాహ్న భోజన వసతికి తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రభుత్వ కళాశాలలపై ప్రైవేట్ కళాశాలలు చేస్తున్న ఆరోపణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని హెచ్చరించా రు. అగ్రహారం, గంభీరావుపేట డిగ్రీ కళాశాల పని తీరును సమీక్షించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు సమిష్ఠిగా పనిచేసి కళాశాలల అభివృద్ధికి తోడ్పడాలనీ, ఉత్తీర్ణ శాతాన్ని పెంచాలని సూచించారు. కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. అలాగే గంభీరావుపేట కళాశాల వసతిగృహం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందులో డీఎస్‌డీవో రాజేశ్వరి, బీసీడీబ్ల్యూవో సువర్ణ, అగ్రహారం, గంభీరావుపేట కళాశాల ప్రిన్సిపాళ్లు శ్రీనివాస్, నర్సయ్య, వైస్‌ప్రిన్సిపల్ మధురాజేశ్, అధ్యాపకులు మల్లారెడ్డి, శ్రీనివాస్, రాజేశ్, వెంకటేశ్వర్లు, శివప్రదీప్ ఉన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...