మెప్మా ఆధ్వర్యంలో జాబ్ మేళా


Sat,November 9, 2019 04:48 AM

సిరిసిల్ల కల్చరల్: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సినారె కళా మందిరంలో నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళాను నిర్వహించారు. దరఖాస్తులు స్వీకరించిన ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు యువతకు ఇంటర్వ్యూలు చేశారు. మెప్మా (రైస్), నాక్ సెంటర్ మెప్మా, హైదరాబాద్ నుంచి కైరోస్ కంపెనీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూలలో 39మంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి శిక్షణ అనంతరం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కల్పిస్తామని మెప్మా సిబ్బంది తెలిపారు. 15రోజుల్లో శిక్షణ ప్రారంభిస్తామని చెప్పారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...