నేడు జిల్లాకు కేటీఆర్


Fri,November 8, 2019 03:41 AM

-ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండలాల్లో పర్యటన
-పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
-ఏర్పాట్లను పూర్తిచేసిన అధికారులు
-ప్రజలు భారీగా తరలిరావాలని టీఆర్‌ఎస్ నాయకుల పిలుపు

రాజన్నసిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ఐటీ, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ నేడు జిల్లాకు రానున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఆయా చోట్ల పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అందులో భాగంగా హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం బయలుదేరి నేరుగా 11.30 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి మంత్రి కేటీఆర్ చేరుకుంటారు. గ్రామ శివారులో సిద్దిపేట రహదారి పక్కన రూ. 3కోట్లతో నిర్మించి న ధాన్యం గోదాములను ప్రారంభిస్తారు. తర్వాత అక్కడే రూ. 6కోట్ల నిధులతో నిర్మించ తలపెట్టిన కోల్డ్ స్టోరేజ్ (ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్) పనుల కు భూమి పూజ చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 12.15 గంటలకు ముస్తాబాద్ మండల కేంద్రానికి చేరుకుంటారు. ని ర్మాణం పూర్తయిన 33/11కేవీ సబ్‌స్టేషన్, షాదిఖానను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చేరుకుని 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి అక్కడే భో జనం చేస్తారు. తర్వాత 3 గంటలకు అక్కపల్లిలో నిర్మించిన 33/11సబ్‌స్టేషన్‌ను, అల్మాస్‌పూర్ గ్రామంలోని గౌడ కమ్యూనిటీ హాలు, రాచర్ల తిమ్మాపూర్‌లో 33/11కేవీ సబ్‌స్టేషన్లను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4.30గంటలకు హైదరాబాద్‌కు మంత్రి తిరుగు ప్రయాణమవుతారు. మం త్రి పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కార్యక్రమాలను విజయవంతం చేయాలి..
ముస్తాబాద్: మండలంలో నిర్మించిన పటు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ విచ్చేయనున్నారని, గులాబీ శ్రేణులు భారీగా తరలివచ్చి కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ పార్టీ మండలా అధ్యక్షుడు సురేందర్‌రావు, రైతుల సమన్వయ కమిటీ నన్వీనర్ కల్వకుంట్ల గోపాల్‌రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముస్తాబాద్‌లో రూ.1.5 కోట్లతో నిర్మించిన సబ్‌స్టేషన్, రెండు ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 25లక్షలతో నిర్మించిన నాలుగు అదనపు తరగతి గదులు, రూ. 40 లక్షల నిధులతో నిర్మించిన షాదీఖానను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని వెల్లడించారు. పార్టీ మండల ప్రజాప్రతినిధులు, మహిళ నాయకులు. కార్యకర్తలు భారీగా తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీపీ జనగామ శరత్‌రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, సర్పంచ్ సుమతి, నాయకులు కొమ్ము బాలయ్య, సర్వర్‌పాషా, అన్వర్, ఎంపీడీవో వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...