డిసెంబర్‌లోగా పనులన్నీ పూర్తవ్వాలి


Fri,November 8, 2019 03:40 AM

సిరిసిల్ల టౌన్: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులను డిసెంబర్‌లోగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశించారు. పట్టణంలోని కొత్త చెరువు సుందరీకరణ, రైతుబజార్ నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కలిసి ఆయన గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మురుగనీటి శుద్ధీకరణ, ఐలాండ్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుబజార్ పనుల్లో జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా ఎందుకు ఆలస్యమవుతున్నదని జిల్లా మార్కెటింగ్ అధికారి, సదరు కాంట్రాక్టర్‌ని ప్రశ్నించారు.

బిల్లులన్నీ ఇప్పటికే మంజూరయ్యాయని, గడువులోగా పనులు పూర్తి చేయాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధ్యులైన అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించి పూర్తి చేయించాలని సూచించారు. ప్రతి 3రోజులకు ఒకసారి ప్రగతి నివేదికను అందజేయాలని ఆదేశించారు. కొత్త చెరువు, ఐలాండ్, మురికి నీటి శుద్ధీకరణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. లే అవుట్ ప్రకారం అలంకరణ మొక్కలు నాటాలని, ఎంట్రీ ప్లాజా పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి షా బొద్దీన్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తదితరులున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...